Wedding: ఇక స్పేస్‌లో పెళ్లిళ్లు…!
Hyderabad: డెస్టినేషన్ వెడ్డింగ్స్(wedding) గురించి వింటూనే ఉన్నాం. కానీ స్పేస్ వెడ్డింగ్స్(space weddings) విన్నారా? అంటే ఇప్పుడు స్పేస్‌లోకి వెళ్లి మరీ పెళ్లి చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా రాబోతోంది. స్పేస్ పర్స్పెక్టివ్ అనే కంపెనీ ఈ స్పేస్ వెడ్డింగ్ ట్రెండ్‌ను పరిచయం చేయబోతోంది. ఓ స్పేస్ షిప్ నెప్ట్యూన్ ఫ్లైట్‌లో వధూ వరులను స్పేస్‌లోకి పంపిస్తారు. భూమి నుంచి దాదాపు లక్ష కిలోమీటర్ల దూరంలోకి ఈ ఫ్లైట్ వెళ్తుంది. అయితే కపుల్‌కి ఆరు గంటల సమయమే ఇస్తారు. ఖర్చు కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. 2024లో ఈ స్పేస్ వెడ్డింగ్ లాంచ్ అవబోతోంది. ఇప్పటికే 1000 టికెట్లు అమ్ముడుపోయాయట. కపుల్‌తో పాటు మరో వ్యక్తి గైడ్‌గా ఉంటాడు. అతను కాక్టెయిల్స్ అవీ అందిస్తుంటాడు. అంతేకాదు.. కపుల్‌కి కావాల్సిన పాటలకు అతనే డీజేగా ఉంటాడు కూడా. అయితే స్పేస్ వెడ్డింగ్‌లో కపుల్‌కి మాత్రమే అనుమతి కాబట్టి మరి ఫ్యామిలీని ఎలా తీసుకెళ్లాలి అనుకుంటున్నారా? ఈ స్పేస్ బెలూన్‌లో వైఫై ఉంటుంది. దాని ద్వారా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వీడియో కాల్ ద్వారా పెళ్లి వేడుకను చూపించవచ్చు.