Viral News: పాపం.. బాస్‌ని ఇరికిద్దాం అనుకుంది..!

Britain: మీటూ(me too) పేరుతో బాస్‌ను(boss) ఇరికిద్దాం అనుకుంది కానీ చివ‌రికి ప్లాన్ బెడిసికొట్టి త‌నే బుక్కైంది(viral news). బ్రిట‌న్‌కు చెందిన గాస్పారోవా అనే మ‌హిళ ఓ ఐటీ కంపెనీలో ప‌నిచేస్తోంది. రెండు రోజుల క్రితం గాస్పారోవాకు బాస్ నుంచి ఓ మెయిల్ వ‌చ్చింది. ఆ మెయిల్‌లో “xx”, “yy”, “???” అనే అక్ష‌రాల‌తో ఓ మెసేజ్ ఉంది. దాంతో “xx” అంటే ముద్దులు, “yy” అంటే సెక్సువ‌ల్ కాంటాక్ట్, “???” అంటే ఎప్పుడు వ‌స్తావ్ అని త‌న‌కి తానే ఊహించేసుకుంది. దాంతో త‌న‌ను బాస్ మెయిల్స్ ద్వారా లైంగికంగా వేధిస్తున్నాడంటూ స్థానిక కోర్టులో కేసు వేసింది. కేసును ప‌రిశీలించిన జ‌డ్జి తీర్పు వెల్ల‌డిస్తూ.. గాస్పారోవా త‌న‌కు తానే ఏవేవో ఊహించేసుకుని మెయిల్‌లోని అక్ష‌రాల‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంద‌ని తెలిపారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసినందుకు గానూ కంపెనీకి 5వేల డాల‌ర్ల జ‌రిమానా చెల్లించాల‌ని అన్నారు. అలా బాస్‌ని ఇరికించ‌బోయి త‌నే ఇరుక్కుపోయింది పాపం.