భ‌యానికే వ‌ణుకు పుట్టించే.. Devara ఆగ‌మ‌నం..!

Hyderabad: యంగ్​ టైగర్​ ఎన్టీఆర్(Jr NTR)​ నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్​ 30(NTR30). కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్​లుక్​ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మే 20న తారక్​ బర్త్​డే సందర్భంగా సాలిడ్​ అప్​డేట్​ ఇస్తారని అనుకున్నారు. అయితే అనుకున్నదానికంటే ముందే నందమూరి అభిమానులకు అదిరిపోయే ట్రీట్​ ఇచ్చారు కొరటాల.

NTR​ 30 టైటిల్​ రివీల్​ చేస్తూ ఫస్ట్​లుక్​ పోస్టర్​ రిలీజ్​ చేశారు. ఇక ఈ సినిమాకు ‘దేవర’(Devara) అనే టైటిల్​ను ఫిక్స్​ చేశారు. సినిమా ప్రారంభం నుంచే సముద్రం, కత్తులు, రక్తపాతం బ్యాగ్రౌండ్​ పోస్టర్లతో బజ్​ క్రియేట్​ చేసిన కొరటాల ఫస్ట్​లుక్​లోనూ ఏమాత్రం తగ్గకుండా ప్లాన్​ చేశారు. ఈ పోస్టర్​ చూసిన అభిమానులు ఎన్టీఆర్​ కెరీర్​లో మరో భారీ హిట్​ ఖాయమంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్​ నెట్టింట వైరల్​గా మారింది.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్​ భామ జాన్వీకపూర్(Jahnvi Kapoor)​ ఎన్టీఆర్​కు జోడీగా నటిస్తోంది. ఆర్​ఆర్​ఆర్(RRR)​ తర్వాత ఎన్టీఆర్​ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్​ 5న ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్​ చేస్తున్నారు మేకర్స్​.