Bichagadu 2: సెంటిమెంట్​తో అదరగొట్టిన విజయ్​ ఆంటోనీ!

Hyderabad: బిచ్చగాడు(Bichagadu) సినిమాతో అటు కోలీవుడ్​తోపాటు ఇటు టాలీవుడ్​లోనూ అభిమానులను సంపాదించుకున్న హీరో విజయ్​ ఆంటోనీ(Vijay Antony). 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాకు సీక్వెల్​ బిచ్చగాడు2(Bichagadu2)తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాకు విజయ్​ స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. అంతేకాదు ఈ సినిమాను విజయ్​ భార్య ఫాతిమా ఆంటోనీ నిర్మించారు. ఈ సినిమాలో కావ్య థాపర్​(Kavya Thapar) హీరోయిన్​గా నటించింది. తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా సెంటిమెంట్​, ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

బిచ్చగాడు సినిమాలో తల్లిపై అంతులేని ప్రేమతో ఆమె ఆరోగ్యం కోసం ఏం చేయడానికైనా వెనకాడని కొడుకుగా మెప్పించిన విజయ్​ ఈసారి చెల్లి సెంటిమెంట్​తో అదరగొట్టారు. ఈ సినిమాలో విజయ్​ ద్విపాత్రాభినయంతో మెప్పించారు. బిచ్చగాడు సత్య పాత్రతో పాటు బిలీనియర్​గానూ నటించారు. బిలీనియర్​ అయిన హీరో అనుకోని పరిస్థితుల్లో ప్రమాదానికి గురవడం, బ్రెయిన్​ డెడ్​తో దాదాపు చావు అంచులవరకు వెళ్లిన హీరోను బ్రెయిన్​ ట్రాన్స్​ప్లాంటేషన్​తో బతికించడంతో సినిమా అసలు కథ మొదలవుతుంది. బిచ్చగాడుగా ఉన్న సత్య బిలీనియర్​గా ఎలా మారాడు? ప్రతిసారి మోసపోయిన బిచ్చగాడు చివరకు ఎలా గెలిచాడు? చిన్నతనంలో విడిపోయిన తన చెల్లి రాణిని కలుసుకున్నాడా, లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.