Keerthy Suresh చేసుకోబోయేది ఇతన్నేనా?
Hyderabad: కీర్తి సురేష్(keerthy suresh) ఇంట త్వరలో పెళ్లిబాజాలు మోగనున్నాయని కోలీవుడ్(kollywood) వర్గాల సమాచారం. కీర్తి(keerthy suresh) తన చిన్ననాటి ఫ్రెండ్‌తో ఎప్పటినుంచో రిలేషన్షిప్లో ఉందని, అతన్నే పెళ్లి చేసుకోబోతోందని అంటున్నారు. ఆ వ్యక్తి పేరు ఫర్హాన్ బిన్ లియక్వాత్. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇప్పుడు ఇతను బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఎందుకంటే.. కీర్తి తన ఇన్‌స్టా స్టోరీలో ఇతని గురించి పోస్ట్ చేసింది. ఆ ఫీలింగే వేరు. థ్యాంక్యూ సో మచ్ కీర్తి సురేష్ అని ఫర్హాన్ పోస్ట్ చేసిన స్టోరీని కీర్తి రీపోస్ట్ చేసింది. థ్యాంక్యూ సో మచ్ డా ఫర్హాన్ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీని గురించి ఇప్పటివరకు కీర్తి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.