Harsha sai: యూట్యూబ్ స్టార్ టాలీవుడ్ ఎంట్రీ!

Hyderabad: ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ హ‌ర్ష సాయి(harsha sai) టాలీవుడ్(tollywood) ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. అవ‌సరంలో ఉన్న‌వారికి సాయం చేస్తూ ఫేమ‌స్ అయిన హ‌ర్ష సాయి(harsha sai) గురించి తెలీనివారు ఉండ‌రు. ఇత‌ని యూట్యూబ్ ఛానెల్‌కు ల‌క్ష‌ల్లో స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆ రేంజ్‌లోనే ఉంది. అయితే.. ప్రముఖ నిర్మాత మిత్రా శ‌ర్మ.. హ‌ర్ష సాయిని టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఆదిపురుష్ ఫేం కార్తిక్ ప‌ళ‌ని.. హ‌ర్ష సాయి సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఏదో సినిమా స్టార్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది. హ‌ర్ష సెట్స్‌లో మైక్ ప‌ట్టుకుని ఉన్న ఫొటో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. అయితే అత‌ను డైరెక్షర్‌గా ఎంట్రీ ఇస్తున్నారా? లేక హీరోగానా అనేది తెలియాల్సి ఉంది.