Rajinikanth సినిమాలు మానేస్తున్నారా?

Hyderabad: సూప‌ర్‌స్టార్ రజినీకాంత్(rajinikanth) సినిమాలు మానేస్తున్నారా? అవున‌నే అంటున్నాయి కోలీవుడ్(kollywood) వ‌ర్గాలు. ఇందుకు కార‌ణం ఈ మ‌ధ్య‌కాలంలో ర‌జినీకి(rajinikanth) మాటిమాటికీ అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డ‌మేన‌ట‌. దాంతో వారంలో ఒక‌సారి ఆయ‌నకు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి వ‌స్తోంది. ప్ర‌స్తుతం ర‌జినీ లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో జైల‌ర్(jailer), కూతురు ఐశ్వ‌ర్య డైరెక్ష‌న్‌లో లాల్ స‌లామ్(laal salaam) సినిమాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాల‌తో ర‌జినీ యాక్టింగ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసి రెస్ట్ తీసుకుంటార‌ని తెలుస్తోంది.

ఇక ర‌జినీ స్టార్‌డం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 72 ఏళ్ల వ‌య‌సులోనూ భాష‌లతో సంబంధంలేకుండా అన్ని ఇండ‌స్ట్రీస్ ఆడియ‌న్స్‌లోనూ ఆయ‌న‌కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ‌తంలో ర‌జినీ రాజ‌కీయాల్లోకి కూడా రావాల‌నుకున్నారు. పార్టీ ప్ర‌క‌టించాల‌నుకున్న స‌మ‌యంలో ఆయ‌న అనారోగ్యం పాల‌య్యారు. దాంతో ఈ పాలిటిక్స్ మ‌న‌కు అవ‌స‌ర‌మా నాన్నా అని కూతుళ్లు ర‌జినీని వేడుకున్నార‌ట‌. దాంతో ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌న్న ఉద్దేశంతో మాత్ర‌మే రాజ‌కీయాల్లోకి రావాల‌నుకున్నాన‌ని, ఆ మంచేదో న‌టుడిగా ఉంటూ కూడా చేయొచ్చ‌న్న ఉద్దేశంతో రాజ‌కీయ ఎంట్రీని క్యాన్సిల్ చేసుకున్నాన‌ని ర‌జినీ వెల్ల‌డించారు. మ‌రి సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారా లేదా అన్న‌ది ఆయ‌న ఫ్యామిలీ నుంచే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాలి.