పార్టీ కోసం CM ప‌ద‌వి వ‌దులుకున్నా: DK Shivakumar

Bengaluru: పార్టీ కోసం ముఖ్య‌మంత్రి(cm) ప‌ద‌విని త్యాగం చేసానని అన్నారు క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివ‌కుమార్(dk shivakumar). కర్ణాట‌క ఎన్నిక‌ల్లో(karnataka elections) కాంగ్రెస్ గెలిచాక తర్వాతి సీఎం ఎవ‌రనే దానిపై సందిగ్ధ‌త నెల‌కొంది. దాదాపు వారం రోజుల పాటు చ‌ర్చ‌లు జ‌రిపాక సిద్ధ‌రామ‌య్య‌నే సీఎంగా ప్ర‌క‌టించింది కాంగ్రెస్. కానీ ఈసారి త‌న‌కు సీఎం ప‌ద‌వి ఇస్తార‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న శివ‌కుమార్‌కు నిరాశే ఎదురైంది. అప్ప‌టికీ ఇస్తే సీఎం ప‌ద‌వి ఇవ్వండి లేదంటే ఎమ్మెల్యేగానే కొన‌సాగుతా అంటూ మొండిప‌ట్టు ప‌ట్టిన శివ‌కుమార్‌తో.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడారు. ఆమె క‌ల‌గ‌జేసుకున్నాకే శివ‌కుమార్ దిగొచ్చారు. డిప్యూటీ సీఎం ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి ఒప్పుకున్నారు.

ఈ సంద‌ర్భంగా డీకే మీడియాతో మాట్లాడారు. “కొన్ని సార్లు పార్టీ కోసం, రాష్ట్రం కోసం కొన్ని వ‌దులుకోక త‌ప్ప‌దు. లోక్‌స‌భ ఎన్నిక‌లు రాబోతున్నాయ్. ఇప్పుడు మా పార్టీ క‌లిసి ప‌నిచేయ‌డం ఎంతో ముఖ్యం. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకోవ‌డం ముఖ్యం. దాంతో సీఎం ప‌ద‌విని వ‌దులుకున్నా” అని తెలిపారు. శ‌నివారం సిద్ధారామ‌య్య‌, శివ‌కుమార్‌లు కంఠీర‌వ స్టేడియంలో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.