DK Shivakumar: రంగంలోకి సోనియా.. లైన్‌లోకి వచ్చిన డీకే!
Bengaluru: ఇస్తే కర్ణాటక సీఎం పదవి ఇవ్వండి లేదా ఎమ్మెల్యేగా ఉంటానని మొండిపట్టుతో ఉన్న డీకే శివకుమార్(dk shivakumar).. మొత్తానికి డిప్యూటీ సీఎం పదవికి ఓకే అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో(karnataka elections) గెలిచిన కాంగ్రెస్(congress) ఎట్టకేలకు సిద్ధరామయ్యనే(siddaramaiah) ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు(dk shivakumar) డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించింది. వీరిద్దరూ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అప్పటివరకు రాహుల్ గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే చెప్పినా వినని డీకే.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇన్‌వాల్వ్ అవ్వగానే డీకే దిగొచ్చారు. బుధవారం సాయంత్రం చాలా సేపటి వరకు డీకేతో చర్చలు జరిపిన సోనియా.. మొత్తానికి డిప్యూటీ సీఎం పదవికి ఒప్పించారు. అంతేకాదు.. ఐదేళ్ల పదవీ కాలాన్ని చెరీసగం పంచుకునే చర్చలకు కూడా సమ్మతించినట్లు తెలుస్తోంది.