నందినీ రెడ్డి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా!
Hyderabad: బాహుబలి(Bahubali) సినిమా తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ఆదిపురుష్(Adipurush) విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) రూపొందించిన ఈ సినిమా జూన్ 16న వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక, ఈ సినిమాతోపాటు సలార్(Salaar), ప్రాజెక్ట్ కె(Project K) తోపాటు మారుతి డైరెక్షన్లో రూపొందుతున్న రాజా డీలక్స్‌లో నటిస్తున్నారు ప్రభాస్. ఇక తాజాగా నందినీ రెడ్డి(Nandini Reddy) కూడా ప్రభాస్‌తో ఓ సినిమా తీయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
అలా మొదలైంది సినిమాతో డైరెక్టర్‌గా మారిన నందనీ రెడ్డి చక్కని సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక నందిని రూపొందించిన తాజా చిత్రం‘అన్నీ మంచి శకునములే’(Anni Manchi Sakunamule). సంతోష్ శోభన్(Santhosh Shoban), మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమా మే 18న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నందిని ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘ప్రభాస్ ప్రాజెక్ట్ K చిత్రం ప్రపంచ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందనే నమ్మకం ఉంది, అంత గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ప్రభాస్ కోసం నా దగ్గర డార్లింగ్ రేంజ్ లవ్ స్టోరీ సిద్ధం గా ఉందని , ఒక్కసారి ప్రభాస్ ఛాన్స్ ఇస్తే కలిసి కథ చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. మరి నందిని రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో చూడాలి!