NTR30: ఫస్ట్​లుక్ రిలీజ్​​.. ఫ్యాన్స్​కి బర్త్​డే ట్రీట్​!

Hyderabad: RRR తర్వాత యంగ్​ టైగర్​ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తున్న చిత్రం NTR30. డైరెక్టర్​ కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి(Sridevi) కూతురు, బాలీవుడ్​ బ్యూటీ జాన్వీ కపూర్(Jahnvi Kapoor)​ ఎన్టీఆర్​కు జోడీగా నటిస్తోంది. యువసుధ ఆర్ట్స్- ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రి 5 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సముద్ర వీరుడుగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ 30 నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబందించిన కీలక అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మే 19 న తారక్ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

ఇక దాంతో పాటు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో సముద్రం ఒడ్డున.. రక్తంతో నిండిన కత్తులను చూపించి మరింత ఆసక్తి పెంచారు. ‘సముద్రం నిండా అతని కథలు.. రక్తంతో రాసినవి.. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు దేవరా అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ఈ టైటిల్​ని కూడా ఎన్టీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.