Gmail అకౌంట్ వాడ‌ట్లేదా.. గూగుల్ డిలీట్ చేసేస్తుంది

Hyderabad: మీకు జీమెయిల్(gmail) అకౌంట్ ఉందా? రెండేళ్లుగా అకౌంట్ వాడ‌లేదా? అయితే గూగుల్(google) మీ అకౌంట్‌ను డిలీట్ చేస్తుంది. అవును.. రెండేళ్లుగా వాడుక‌లో లేని జీమెయిల్(gmail) ఖాతాల‌ను డిలీట్ చేయ‌బోతున్న‌ట్లు గూగుల్ ప్ర‌క‌టించింది. హ్యాకింగ్ నుంచి అకౌంట్స్‌ని కాపాడుకునేందుకు ఈ చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు గూగుల్ ప్ర‌క‌టించింది. అయితే ఇది కేవ‌లం ప‌ర్స‌న‌ల్ అకౌంట్ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. బిజినెస్ ప‌రంగా ఉన్న అకౌంట్లు అలాగే ఉంటాయి. 2020లోనూ గూగుల్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. కాక‌పోతే అప్ప‌ట్లో కేవ‌లం గూగుల్ అకౌంట్స్‌లో ఉన్న కంటెంట్‌ను మాత్ర‌మే డిలీట్ చేయాల‌ని అనుకుంది. డిలీట్ చేయ‌డానికి ముందు గూగుల్ ప‌లుమార్లు వార్నింగ్ మెయిల్స్ పంపుతుంది. అప్ప‌టికీ పాస్‌వ‌ర్డ్ మార్చుకోకుండా.. అకౌంట్ వాడ‌కపోతే వెంట‌నే డిలీట్ చేసేస్తుంది. గ‌త వారం ట్విట‌ర్ సీఈవో ఎలాన్ మ‌స్క్ కూడా ఇలాంటి ప్ర‌క‌ట‌నే చేసారు. వాడుక‌లో లేని ఖాతాల‌ను తొల‌గించేస్తామ‌ని ప్ర‌క‌టించారు.