వధువు కావలెను.. ఇల్లు, కారు, లక్ష జీతం ఉండాలి..!
China: పెళ్లి(marriage) విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. డబ్బు, సంస్కారం ఉన్న అబ్బాయి కావాలని అమ్మాయి(bride) ఎలా కోరుకుంటుందో అబ్బాయి(groom) కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ అత్యాశకు పోతేనే సమస్య. చైనాకు చెందిన ఓ యువకుడు ఓ మ్యాట్రిమోనియల్ సైట్లో తన ప్రొఫైల్ అప్లోడ్ చేసుకున్నాడు. అయితే కాబోయే అమ్మాయి(bride) ఎలా ఉండాలో అతను పెట్టిన కండీషన్స్ చూసి అంతా షాకవుతున్నారు. అమ్మాయి(bride)కి కారు, ఇల్లు ఉండాలట. కాకపోతే ఆ రెండూ లోన్లో తీసుకున్నా కూడా లోన్ మొత్తం తీరిపోయి ఉండాలట. అంతేకాదు.. నెలకు రూ.15 లక్షల జీతం సంపాదించే అమ్మాయి కావాలి అని పెట్టాడు.
అయితే ఆ అబ్బాయికి మాత్రం ఇల్లు, కారు లేకపోగా.. జీతం రూ.70,000 సంపాదిస్తున్నాడు. తన దగ్గర లేనివి.. తనకు కాబోయే భార్య వద్ద ఉండాలనుకోవడంలో తప్పేముంది అంటున్నాడు. అంతేకాదు.. తనకు తాగుడు, సిగరెట్ అలవాటు లేకపోవడం అమ్మాయికి ప్లస్ పాయింటేగా అంటున్నాడు. తనను చేసుకోబోయే అమ్మాయిని, అత్తామామలను కంటికి రెప్పలా చూసుకుంటానని కూడా చెప్తున్నాడు. నిజానికి.. అతను కోరుకున్నవాటిలో తప్పేమీ లేదు. కాకపోతే.. మరీ జీతం రూ.1.5 లక్షలు ఉండాలని అనడమే కాస్త విడ్డూరంగా ఉంది. అయితే.. ఇవన్నీ అతను సరదాగా పెట్టిన కండీషన్స్ అని తర్వాత మీడియా ద్వారా వెల్లడించాడు ఆ వ్యక్తి. అతని వయసు 34 ఏళ్లని.. నెలకు రూ.3 లక్షల వరకు సంపాదిస్తానని తెలిపాడు. సరదాగా ఎలాంటి సంబంధాలు వస్తాయో చూద్దామని ప్రొఫైల్లో ఆ కండీషన్లు పెట్టానని తెలిపాడు.