Pawan: జగన్‌పై పవన్ సెటైర్.. పవన్‌కు ఆర్జీవీ కౌంటర్!
Hyderabad: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై(pawan kalyan)సీఎం జగన్‌పై సెటైర్ వేసారు. “డియర్ ఏపీ సీఎం, మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగి రెడ్డి కాదు. అక్రమ సంపాదనతో ప్రజలపై హింస సాగిస్తున్న మీరు క్లాస్‌వార్ అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా హక్కు లేదని పవన్ అన్నారు. అంతేకాకుండా.. ఏదో ఒక రోజు రాయలసీమకు, రాష్ట్ర ప్రజలకు మీ నుంచి విముక్తి లభించాలి. ఈ స్టోరీకి రాజస్థాన్ ఎడారి ఇసుక దిబ్బలు కావాలి, కానీ YCP ఏపీలోని నదీ తీరాల నుంచి దోచుకుంది. కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి” అని చెబుతూ చివర్లో చీర్స్ అంటూ ముగించారు. ఇక ఇలా పవన్ ట్వీట్ చేశారో లేదో వెంటనే.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు.
పాపం పసివాడు చిత్రాన్ని పవన్‌తో కూడా తీయవచ్చని రామ్ గోపాల్ వర్మ(RGV) సెటైర్స్ వేశారు. ”మీరు అజ్ఞానంగా అమాయకంగా ఉన్నందున ఎవరైనా మీతో కూడా ఈ చిత్రాన్ని తీస్తారని అనుకుంటున్నా” అని అన్నారు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరమని.. ఒక పాత్రను పోషించే బదులు మల్టీ డిజార్డర్స్ సమస్య ఉన్న మీరు రెండు మూడు పాత్రల్లో కనిపించవచ్చని పవన్‌కు సూచించారు. పవన్ సీఎం అవ్వనని చెప్పారని, అలాంటప్పుడు ఆయన నోటి నుంచి ప్రజాసేవ అనే పదం కూడా ఉచ్చరించే హక్కు లేదన్నారు. అమాయక అభిమానులను రెచ్చగొట్టి దాడులకు ప్రేరేపించే దురుద్దేశంతో ఉన్న మీ నుంచి అమాయకులైన జనసైనికులు మీ నుంచి దూరం అవుతారని అదే ఆశిస్తున్నానని పవన్‌ను ఉద్దేశించి ఆర్జీవీ పేర్కొన్నారు. చివరిలో పీఎస్ అని పెట్టి.. పాపం పసివాడు కథకు రాజస్థాన్ ఎడారిలోని ఇసుక దిబ్బలు కావాలి, అయితే కొన్ని ప్రాంతాల్లో మీకు అమాయక అనుచరులు ఉన్నందున.. వారిని మీరు ఆకట్టుకోవాలంటే… హైదరాబాదే కరెక్టు.. చీర్స్! అంటూ.. పవన్ చేసిన ట్వీట్‌కు అదేరీతిలో కౌంటర్ ఇచ్చారు ఆర్జీవీ.