Sharwanand వెడ్డింగ్ డేట్ ఫిక్స్.. జైపూర్‌లో అట్ట‌హాసంగా..

Hyderabad: న‌టుడు శ‌ర్వానంద్(sharwanand) పెళ్లి తేదీ ఫిక్స్ అయిపోయింది. జూన్ 2, 3 తేదీల్లో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లోని లీలా ప్యాలెస్ వీరి పెళ్లికి వేదిక కానుంది.  శ‌ర్వానంద్‌కు కాబోయే భార్య పేరు ర‌క్షిత‌(rakshita). ర‌క్షిత రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నారు. కొన్ని నెల‌ల క్రితం వీరి నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. అయితే జ‌న‌వ‌రిలో నిశ్చితార్థం అయ్యాక‌.. శ‌ర్వా ఫ్యామిలీ నుంచి పెళ్లిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇన్ని నెల‌లు కావొస్తున్నా పెళ్లి కాక‌పోవ‌డంతో మ్యారేజ్ క్యాన్సిల్ అయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. శ‌ర్వానంద్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం 40 రోజుల పాటు లండ‌న్ వెళ్లారు. అన్ని క‌మిట్‌మెంట్స్ పూర్తి చేసుకున్నాకే పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. జూన్ 2 నుంచి లీలా ప్యాలెస్‌లో పెళ్లి ప‌నులు ప్రారంభం అవుతాయి. జూన్ 3న వివాహ ముహూర్తాన్ని ఖ‌రారు చేసారు. తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చాక గ్రాండ్‌గా రిసెప్ష‌న్ ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.