Karnataka CM రేస్‌లో చేరిన మూడో వ్యక్తి!
Bengaluru: కర్ణాటక ఎన్నికల్లో(karnataka elections) కాంగ్రెస్ గెలిచి దాదాపు వారం రోజులు కావొస్తోంది. ఇప్పటికీ రాష్ట్ర సీఎం(karnataka cm) పేరును ప్రకటించలేదు. రేసులో డీకే శివకుమార్(dk shivakumar), సిద్ధారామయ్య(siddaramaiah) ఉన్నారు. అయితే ఇప్పుడు మూడో వ్యక్తి పేరు కూడా వినిపిస్తోంది. అతనే జి.పరమేశ్వర(g parameshwara). ఇతను మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఈ రేసులోకి ఇప్పుడు ఇతను కూడా చేరతానంటున్నాడు. 50 మంది ఎమ్మెల్యేల మద్దతుతో దిల్లీ వెళ్లి సీఎం సీటు అడగలను. కానీ నాకు నైతిక విలువలు ఉన్నాయి. అధిష్టానం అనుమతిస్తే సీఎంగా బాధ్యతలు స్వీకరించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
అసలు ఎవరీ జి.పరమేశ్వర?
పరమేశ్వర దళిత నాయకుడు. 2010-2018 మధ్యలో స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. 2013లో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు.. సీఎం అభ్యర్ధిగా సిద్ధరామయ్య పేరుతో పాటు పరమేశ్వర పేరు కూడా లిస్ట్‌లో ఉంది. కానీ మెజార్టీ సిద్ధరామయ్యకే ఉండటంతో కాంగ్రెస్ ఆయన్ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్ సీఎం రేసులో డీకే, సిద్ధా తలపడనుండడంతో పరమేశ్వర కీలక కామెంట్స్ చేసారు. “నేను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేసా. డిప్యూటీ సీఎంగా పనిచేసా. సీఎం కావాడానికి ఉండాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయి. నేను లాబీయింగ్ చేయడంలేదు అంటే దాని అర్థం నాకు కెపాసిటీ లేదని కాదు” అని తెలిపారు. పరమేశ్వరనే కాకుండా సతీష్ జర్కోలీ, రామలింగా రెడ్డిలు కూడా తాము సీఎం పదవికి అర్హులేనని అంటున్నారు. మరి కాంగ్రెస్ ఎవర్ని ప్రకటించనుందో వేచి చూడాలి.