SSMB28: ఈసారి తండ్రి టైటిల్‌తో..!

Hyderabad: సూప‌ర్‌స్టార్ మ‌హేష్(Mahesh Babu) ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్(Trivikram) ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. SSMB 28 వర్కింగ్​ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 13న‌ విడుద‌ల చేస్తామ‌ని ప్రకటించారు మేకర్స్​. ఈ సినిమాలో మహేష్​ సరసన పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీలీల(Sreeleela) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా.. సూప‌ర్‌స్టార్ కృష్ణ(Krishna) పుట్టిన‌రోజు సందర్భంగా మే 31న SSMB 28 టైటిల్ అనౌన్స‌మెంట్‌తో పాటు టీజ‌ర్‌ను కూడా విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది. ఈ సినిమాకోసం ఇప్ప‌టికే మూడు టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. అందులో గుంటూరు కారం..అమరావతికి అటు ఇటు…అనే రెండు టైటిల్స్ కాకుండా మరో టైటిల్ కూడా డిస్కషన్ లో ఉంది. అదే ఊరికి మొన‌గాడు(ooriki Monagadu). ఈ టైటిల్‌తో 1981లోసూప‌ర్‌స్టార్ కృష్ణ సూప‌ర్ హిట్ మూవీ చేశారు. ఇప్పుడా టైటిల్ కూడా మేక‌ర్స్ ప‌రిశీలిస్తున్నారు. మ‌రి మ‌హేష్ తండ్రి టైటిల్‌కు ఓటేస్తారా? లేక గుంటూరు కారం, అమ‌రావ‌తికి అటు ఇటు.. అనే టైటిల్స్ నుంచి ఓ టైటిల్‌ను ఎంపిక చేసుకుంటారా! అనేది చూడాలి. ఇక మే 31న కృష్ణ కెరీర్‌లో సూపర్​ హిట్​ మూవీగా నిలిచిన, టాలీవుడ్ తొలి కౌబోయ్ చిత్రం మోస‌గాళ్ళ‌కు మోస‌గాడు(Mosagallaku Mosagadu) సినిమాను 4K టెక్నాలజీతో రీ రిలీజ్ చేయ‌నున్నారు. ఆ సినిమా థియేట‌ర్స్‌లో SSMB 28 టీజ‌ర్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు ప్లాన్​ చేస్తున్నారట మేకర్స్​.