“కత్రినాని వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటారా?”
Mumbai: బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్‌ని(vicky kaushal) ఓ చెత్త ప్రశ్న అడిగాడు ఓ జర్నలిస్ట్. కత్రినా కైఫ్‌ని(katrina kaif) వదిలేసి వేరే అమ్మాయిని చేసుకుంటారా? అని అందరిముందు ప్రశ్నించాడు. విక్కీ కౌషల్ నటించిన జర హట్కే జర బచ్కే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ముంబైలో గ్రాండ్‌గా ఏర్పాటుచేసారు. ఆ సమయంలో వివిధ ఛానెల్స్‌కు సంబంధించిన జర్నలిస్ట్‌లు వచ్చారు. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్.. సర్.. “మన భారతదేశంలో పెళ్లి అంటే జన్మ జన్మల బంధం అని చెప్తుంటారు. ఒకవేళ కత్రినా(katrina) కంటే మంచి అమ్మాయి దొరికితే మీరు ఆమెను వదిలేసి పెళ్లి చేసుకుంటారా” అని అడిగాడు. ఇందుకు విక్కీ కౌషల్‌తో పాటు అక్కడున్నవారంతా షాకయ్యారు.
దీనికి విక్కీ ఆన్సర్ ఇస్తూ.. “నేను ఇంకా చిన్న పిల్లాడిని సర్. ఇప్పుడే జీవితం అంటే ఏంటో తెలుస్తోంది. సాయంత్రం ఇంటికి వెళ్లాలి. మీరు ఇలాంటివి అడక్కండి” అని రిప్లై ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో జర్నలిస్ట్‌లు ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు అడిగి జర్నలిజానికే మచ్చ తెస్తున్నారని చెప్పుకోవాలి. అసలు ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలీని వారికి మైక్ ఇవ్వడం తప్పు. ఇలాంటి వారిని అసలు మీడియా కాన్ఫరెన్స్‌లకు రానివ్వకూడదని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.