Virupaksha: నెట్​ఫ్లిక్స్​లోకి విరూపాక్ష!

Hyderabad: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘విరూపాక్ష’(Virupaksha). ఈ సినిమా ఏప్రిల్​ 21న గ్రాండ్​గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది.  హార్రర్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అందాల భామ సంయుక్త మీనన్(Samyuktha Menon) సరికొత్త పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించింది. దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాని డైరెక్ట్ చేయగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) స్క్రీన్ ప్లే ని అందించాడు. ముందుగు తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో.. హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు.

ఇక థియేటర్ లో అందర్నీ భయపెట్టిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. 91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని సాయి ధరమ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ సూపర్ హిట్ మూవీ ఎప్పుడు ఓటీటీకి వస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో మే 21 నుంచి ఈ మూవీ ప్రసారం కానుంది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!