Kamal Haasan: శెభాష్ రాహుల్‌..గాంధీలా మ‌న‌సు గెలుచుకున్నావ్

Chennai: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని(rahul gandhi).. న‌టుడు క‌మ‌ల్ హాస‌న్(kamal haasan) అభినందించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(karnataka elections) కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(rahul gandhi) కీ రోల్ పోషించారని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన జోడో యాత్రకు అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక కర్ణాటక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని రాహుల్ అనేక ప్రాంతాల్లో జోడో యాత్ర నిర్వహించారు. అంతే కాకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇది ఆ పార్టీకి ఎంతో మేలుచేసిందని చెప్పవచ్చు. ఇక తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ప్రముఖ నటుడు, ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్ స్పందించారు. రాహుల్ శబాష్ అంటూ అయనపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో ట్వీట్ పెట్టారు.

“మీ సౌమ్యమైన మార్గంలో ప్రేమ, వినయంతో ప్రపంచంలో ఏ శక్తినైనా కదలించవచ్చనని నిరూపించారు. ప్రగల్భాలకు పోకుండా, రొమ్ముచరుచుకోకుండా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. కర్ణాటక ప్రజలు విభజన రాజకీయాలను తిరస్కరిస్తారని మీరు నమ్మారు. ఇప్పుడు వారంతా ఐకమత్యంగా స్పందించి మీపై ఉన్న నమ్మకాన్ని తెలియజేశారు. విజయానికే కాదు.. ఆ విజయం సాధించిన తీరుకు కూడా మీకు వందనం..’ అని కమల్ ట్వీట్ చేశారు. ఇప్పటికీ కర్ణాటక ఫలితాలపై అనేకమంది ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ప్రత్యేకంగా రాహుల్ గాంధీని కూడా కొందరు పొగుడుతున్నారు.