Chandramukhi 2: రిలీజ్ ఎప్పుడో తెలుసా!
Chennai: సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth), ప్రభు, జ్యోతిక, నయనతార(Nayanthara) ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి(Chandramukhi) అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా చంద్రముఖి-2(Chandramukhi 2)ను దర్శకుడు పి వాసు(P. Vasu) తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సీక్వెల్లో బాలీవుడ్(Bollywood) క్వీన్ కంగనా రనౌత్(Kangana Ranaut) చంద్రముఖిగా నటిస్తుండగా, రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
పి వాసు దర్శకత్వంలో 2005లో విడుదలైన చంద్రముఖి భారీ కలెక్షన్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తుండగా, వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, శ్రుతి డాంగే, సుభిక్ష కృష్ణన్, రవి మారియా, కార్తీక్ శ్రీనివాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఇరవై రెండేళ్ల తర్వాత మళ్లీ తమిళ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కంగనా రనౌత్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జూన్ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న వినాయక చవితి కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం.