Salary: 15 ఏళ్లు సెలవులో ఉండి..జీతం పెంచలేదని దావా!
Britain: సెలవులు పెట్టినా కంపెనీలు పెయిడ్ లీవ్స్(paid leaves) ఇస్తాయి. పెయిడ్ లీవ్స్ తీసుకున్నారని కంపెనీ జీతం(salary) ఇవ్వకపోతే దావా వేసేవాళ్లని చూసాం కానీ.. ఓ వ్యక్తి ఏకంగా 15 ఏళ్లు కంపెనీలో లీవ్ పెట్టి జీతం పెంచనందుకు దావా వేసాడు. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. ఇయాన్ అనే ఐటీ ఉద్యోగి.. IBMలో సీనియర్ మేనేజర్‌గా 2007లో జాయిన్ అయ్యాడు. కానీ 2008లో ఓ ప్రమాదం కారణంగా వికలాంగుడిగా మారడంతో 15 ఏళ్ల పాటు కంపెనీకి దూరమయ్యాడు. అయితే అతను రిజైన్ చేయలేదు. ఇనాక్టివ్ ఉద్యోగిగా కొనసాగాడు. అతను వికలాంగుడు కావడంతో కంపెనీ కూడా అతనికి నెల నెలా జీతం ఇస్తూనే ఉంది. వికలాంగులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్‌నీ ఇస్తోంది. అయితే 2022లో ఇయాన్.. కంపెనీపై దావా వేసాడు. కంపెనీలో చేరి 15 ఏళ్లు అవుతున్నప్పటికీ తనకు ఎలాంటి హైక్ ఇవ్వలేదని దావాలో పేర్కొన్నాడు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. కేసు కొట్టివేసింది. వికలాంగుడు అయినంతమాత్రాన ఏది పడితే అది అడిగితే ఇవ్వలేరని, ఉద్యోగం చేయకపోయినప్పటికీ కంపెనీ నెల నెలా జీతం, ఇతర బెనిఫిట్లు ఇస్తోందని చీవాట్లు పెట్టింది.