China: పెళ్లి, పిల్లల కోసం చైనా కొత్త ప్రాజెక్ట్
Beijing: చైనాలో(china) జనాభా అమాంతంగా పడిపోయింది. ఒకప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరొందిన చైనా(china) ఇప్పుడు వెనుకబడిపోయింది. ఇందుకు కారణం.. పెళ్లిళ్లు, పిల్లలు వద్దనుకుంటున్న అక్కడి యువత. ముందు ముందు ఇలాగే సాగితే లేనిపోని సమస్యలు వస్తాయని భావించిన చైనా ప్రభుత్వం(chinese government) ఓ నిర్ణయం తీసుకుంది. పిల్లలు(birth rate), పెళ్లిళ్లపై(marriages) యువతకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం చైనాలోని(china) టాప్ 20 నగరాల్లో ప్రాజెక్ట్‌లను లాంచ్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌లను చైనాకు చెందిన ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ చేపట్టనుంది.
ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా పెళ్లిళ్లు, పిల్లల గురించి అవగాహన కల్పిస్తారు. వాటి ఇంపార్టెన్స్‌ను యువతను తెలియజేస్తారు. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ మూడో బిడ్డ పుడితే వారికి ఇన్‌సెన్టివ్స్, రాయితీలు, ఉచిత విద్యను కూడా ప్రభుత్వమే ఇస్తుందని ప్రకటించారు. 1980లో చైనా ఒక బిడ్డ పాలసీని(one child policy) తీసుకొచ్చింది. దాంతో 2015కే అక్కడి జనాభా పడిపోయింది. ఇప్పుడు అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్(india) చైనాను దాటేసింది. దాంతో చైనా ఇప్పుడు పిల్లల లిమిట్‌ను 3కి పెంచింది. అయితే పెళ్లి అయినప్పటికీ పిల్లలు కలగని ఆడవారి కోసం ఐవీఎఫ్(ivf) ద్వారా పిల్లల్ని కలిగే సదుపాయం కూడా కల్పించింది చైనా ప్రభుత్వం. ఒకవేళ పెళ్లి అయ్యి భర్త చనిపోతే వారి అండాల్ని ఫ్రీజ్ చేయించి పిల్లలు పుట్టించే సదుపాయాలను కూడా కల్పిస్తోంది.