DK Shivakumar: డీకేకి నచ్చని వ్యక్తి..CBI చీఫ్‌గా..!
Delhi: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు(dk shivakumar) నచ్చని పోలీస్.. నేడు సీబీఐ చీఫ్‌గా దిల్లీలో బాధ్యతలు తీసుకోనున్నారు. ఇంతకీ ఆ పోలీస్ ఎవరంటే.. కర్ణాటకకు డీజీపీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ సూద్(praveen sood). కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రవీణ్ సూద్ సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోవడం చర్చలకు దారితీస్తోంది. ఎందుకంటే.. గతంలో శివకుమార్.. ప్రవీణ్‌ను నాలాయక్ అంటూ తీవ్రంగా ధూషించారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు.. డీజీపీ హోదా ఉన్న ప్రవీణ్.. కాంగ్రెస్ నేతలపై దాదాపు 25 కేసులు పెట్టించారు కానీ బీజేపీ నేతలపై ఒక్క కేసు కూడా లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటినుంచి శివకుమార్‌కు.. ప్రవీణ్ అంటే ఒళ్లుమంట.
ప్రధాని నరేంద్ర మోదీ, సీజేఐ డీవై చంద్రచూడ్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరిల సమక్షంలో ప్రవీణ్ సూద్‌ను నియమించారు. అయితే.. ప్రవీణ్ సీబీఐ చీఫ్ అవడం అధీర్ రంజన్‌కు కూడా ఇష్టం లేదు. కానీ మెజార్టీ ప్రవీణ్ వైపే ఉండటంతో అతన్నే సీబీఐ చీఫ్‌గా నియమించాల్సి వచ్చింది. మరో రెండేళ్ల పాటు ప్రవీణ్ సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు వహిస్తారు. దిల్లీ ఐఐటీలో గ్రాడ్యయేట్ అయిన ప్రవీణ్ 1986 బ్యాచ్‌కి చెందిన వ్యక్తి. 1989లో మొదటిసారి మైసూరులో అసిస్టెంట్ ఎస్పీగా బాధ్యతలు అందుకున్నారు. ఆ తర్వాత మారిషస్‌లోనూ విధులు నిర్వర్తించారు. ఎక్కువగా టెర్రరిజంకు సంబంధించిన కేసులను పట్టుకోవడంలో ఆయన ఎక్స్‌పర్ట్.