Satyender Jain: జైల్లో ఒంట‌రిగా ఉన్నా..తోడు కావాలి

Delhi: జైల్లో ఒంట‌రిగా ఉండ‌లేక‌పోతున్నాను.. తోడు కావాలి అని శిక్ష అనుభ‌విస్తున్న AAP మంత్రి స‌త్యేంద‌ర్ జైన్(satyender jain) రాసిన లెట‌ర్ వివాదాస్ప‌దంగా మారింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో సత్యేంద‌ర్.. దిల్లీలోని తిహార్ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆయ‌న సెల్‌లో ఒక్క‌రే ఉంటున్నార‌ట‌, బోర్ కొడుతోంది అంటూ జైల్ సూప‌రింటెండెంట్‌కు లెట‌ర్ రాసారు. దాంతో ముందు వెన‌క ఆలోచించ‌కుండా స‌త్యేంద‌ర్ సెల్‌లోకి ఇద్ద‌రు ఖైదీల‌ను పంపించాడు ఆ సూప‌రింటెండెంట్. విష‌యం బ‌య‌టికి పొక్క‌డంతో అత‌నిపై వేటు ప‌డింది. వెంట‌నే ఆ ఇద్ద‌రు ఖైదీల‌ను వేరే సెల్‌లోకి మార్పించేసారు. స‌త్యేంద‌ర్ జైన్ ఒంట‌రిత‌నంతో డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోతున్నార‌ని, అత‌నికి తోడుగా ఎవ‌రైనా ఉంటే బాగుంటుంద‌ని జైన్‌కు వైద్యం అందిస్తున్న డాక్ట‌ర్లు చెప్పినందుకే ఇలా చేసాన‌ని సుప‌రింటెండెంట్ అన్నారు. ఏదేమైనా పై అధికారుల‌తో చ‌ర్చించ‌కుండా సొంతంగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని వీల్లేద‌ని అత‌నికి షోకాజ్ నోటీసులు జారీ చేసారు. దిల్లీ లిక్క‌ర్ పాల‌సీలో నిందితుడిగా ఉన్న ఆప్ మంత్రి మ‌నీశ్ సిసోడియా కూడా తిహార్ జైల్లోనే ఉన్న సంగ‌తి తెలిసిందే.