RT74: క్రేజీ డైరెక్టర్​తో మాస్​ మహారాజ!

Hyderabad: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు మాస్​ మహారాజ రవితేజ(Raviteja). గతేడాది ధమాకా(Dhamaka)తో ఫర్వాలేదనిపించినా వరుస ప్లాపులు రవితేజను కలవర పెడుతున్నాయి. ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజైన రావణాసుర(Ravanasura) కూడా డిజాస్టర్​ గానే మిగిలింది. దాంతో కథలు, డైరెక్టర్ల ఎంపికలో కాస్త జాగ్రత్త తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే తన తదుపరి సినిమా టైగర్​ నాగేశ్వర్​ రావు(Tiger Nageswara Rao) ఫస్ట్​ లుక్​ రిలీజ్​ చేశారు. ఈ పోస్టర్ ​కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాతో అయినా సక్సెస్​ ట్రాక్​ ఎక్కాలనుకుంటున్నారు రవితేజ. తాజాగా క్రేజీ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్న​అనుదీప్(Anudeep KV)​తో రవితేజ సినిమా ఫైనల్​ అయినట్లు తెలుస్తోంది.
జాతిరత్నాలు, ప్రిన్స్ ఫేమ్ అనుదీప్ కేవీతో ఓ సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రీసెంట్‌గా ఈ క్రేజీ దర్శకుడు రవితేజని కలిసి ఒక స్టోరీ వినిపించాడని, అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశాడని తెలుస్తోంది. ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందనుందని టాక్. రవితేజ ఓ పూర్తిస్థాయి కామెడీ సినిమా చేసి చాలాకాలం అవుతోంది. నిజానికి రవితేజ డైలాగ్​ డెలివరీతో కామెడీ చేయగలరు. ఇక రవితేజ టైమింగ్​ కి అనుదీప్​ డైలాగ్స్​ తోడైతే తప్పకుండా మంచి కామెడీ సినిమా అవుతుందని అభిప్రాయ పడుతున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’ సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఫస్ట్​లుక్​ రిలీజ్​ చేసిన టైగర్ నాగేశ్వరరావు మీద భారీ అంచనాలే ఉన్నాయి