IPL 2023: రాజస్థాన్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతు!
Jaipur: IPL 2023 లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఘన విజయం సాధించింది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 112 పరుగుల తేడాతో రాజస్థాన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించింది. 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ ను 10.3 ఓవర్లలో 59 పరుగులకే ఆలౌట్ చేసింది. జో రూట్ 10, హెట్ మేయర్ 35 పరుగులు చేశారు. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్, జో బట్లర్ సహా నలుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. బెంగళూరు బౌలర్లలో పార్నెల్ 3, బ్రాస్ వెల్, శర్మలకు చెరో రెండు వికెట్లు, మహమ్మద్ సిరాజ్, మాక్స్ వెల్ లకు చెరో ఒక వికెట్ పడ్డాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ కోహ్లీ 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. డుప్లెసిస్ 55, మాక్స్ వెల్ 54 పరుగులతో చెలరేగారు. అనుజ్ రావత్ చివర్లో 11బంతుల్లో 29 పరుగులు చేయడంతో బెంగళూరు 20 ఓవర్లలో 171 పరుగులు చేయగల్గింది. లేకపోతే ఓ మోస్తారు స్కోరుకే పరిమితమయ్యేది. రాజస్థాన్ బౌలర్లలో అడమ్ జంపా, కేఎం ఆసీఫ్ లకు చెరో రెండు వికెట్లు తీయగా, సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు .