Congress: పొత్తు పెట్టుకుంటాం.. BRSతో మాత్రం కాదు

Hyderabad: కాంగ్రెస్(congress) పార్టీ పొత్తులు పెట్టుకోవ‌డానికి రెడీగా ఉంద‌ని అన్నారు సీనియ‌ర్ నేత కేసీ వేణు గోపాల్(kc venugopal). కర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌య‌దుంధుబి మోగించిన నేప‌థ్యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఎంతో ద‌గ్గ‌రి వ్య‌క్తి అయిన వేణు గోపాల్ పార్టీ పొత్తుల ప్లాన్ల గురించి వివ‌రించారు.

“ప్రాంతీయ పార్టీల‌తో విబేధాలు ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోవ‌డానికి సిద్ధంగా ఉంది. అలాగ‌ని తెలంగాణ‌లో బీఆర్ఎస్, కేర‌ళ‌లో CPI-Mల‌తో పొత్తులు పెట్టుకోలేం. అయితే ఎన్నికల తర్వాత పొత్తులు, కొన్ని సందర్భాల్లో ముందస్తు పొత్తు పెట్టుకోవచ్చు. ఇక క‌ర్ణాటక సీఎం విష‌యానికొస్తే.. డీకే శివ‌కుమార్‌, సిద్ధారామ‌య్య‌ల్లో ఎవ‌రో ఒక‌ర్ని నియ‌మిస్తారు. ఇంకా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కానీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే మాత్రం సీఎం అయ్యే అవ‌కాశం లేదు. అలాంటి రూమ‌ర్స్ ప‌ట్టించుకోవ‌ద్దు. ఒక రాజ‌స్థాన్‌లో స‌చిన్ పైల‌ట్, అశోక్ గెహ్లోత్ మ‌ధ్య ఉన్న అంత‌ర్గ‌త విబేధాల‌ను కూడా త్వ‌ర‌లో ప‌రిష్క‌రిస్తాం. అసెంబ్లీ ఎన్నిక‌లు అయిపోయాయి కాబ‌ట్టి.. వచ్చే సంవ‌త్స‌రం జ‌ర‌గ‌బోయే లోక్ స‌భ ఎన్నిక‌ల కోసం దేశ‌వ్యాప్తంగా మ‌రో క్యాంపెయిన్ చేయ‌బోతున్నాం. తూర్పు నుంచి ప‌డ‌మ‌ర వ‌ర‌కు మ‌రో భార‌త్ జోడో యాత్ర చేప‌ట్ట‌బోతున్నాం” అని తెలిపారు వేణు గోపాల్.