Health: వీటి తొక్క తీయాల్సిందే..!

Hyderabad: తొక్క‌తో(peel) స‌హా తింటేనే ఎంతో బ‌లం(health) పెద్ద‌వాళ్లు చెప్తుంటారు. కానీ అన్ని పండ్లు(fruits), కూర‌గాయ‌ల‌కు(vegetables) ఆ నియ‌మం వ‌ర్తించ‌దు. అస‌లు మామూలుగా పండ్లు లేదా కూర‌గాయ‌ల తొక్కు ఎందుకు తీస్తామంటే.. వాటిలో ఉండే ర‌సాయ‌నాలు, టాక్సిన్స్ ఏమ‌న్నా ఉంటే తొక్క‌తో స‌హా వెళ్లిపోతాయి. అరుగుద‌ల కూడా బాగుంటుంది. కొన్ని పండ్లు, కూర‌గాయ‌ల‌ను త‌ప్ప‌కుండా తొక్క తీసే తినాలి. అవేంటంటే..

మామిడి
మామిడి పండ్ల‌తో చాలా మంది తొక్క‌తోనే తినేస్తుంటారు. అందులో ఎన్నో పోష‌కాలు ఉన్న‌ప్ప‌టికీ ఉరోషియోల్ అనే విష‌పూరిత ప‌దార్థం కూడా ఉంటుంది. కాబ‌ట్టి తొక్క తీసే తినండి.

అవొకాడో
అవొకాడో ఆరోగ్యానికి ఎంతో మంచిది. దాని తొక్క తీసి తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది. డైరెక్ట్‌గా తినాల‌న్నా, లేదా స‌లాడ్‌లో వేసుకోవాల‌న్నా తొక్క తీసే తినండి.

చిల‌గ‌డ‌దుంప‌లు
చిల‌గ‌డ దుంప‌ల తొక్క‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అలాగ‌ని తొక్క తీయ‌కుండా తింటే అర‌గ‌దు. క‌డుపునొప్పి వ‌స్తుంది. విరోచ‌నాలు అయ్యే అవ‌కాశ‌మూ ఉంది.

గుమ్మ‌డి
గుమ్మ‌డి తొక్క‌ను మామూలుగా కూడా చాలా మంది తింటారు. పొట్టుకూర‌లా వండుకుంటారు కూడా. కానీ తొక్క‌తో స‌హా వండితే ఉడ‌క‌డానికి చాలా టైం పడుతుంది. అలాగ‌ని ఎక్కువ సేపు ఉడికిస్తే అందులో ఉండే పోష‌కాలు పోతాయి. దాని బ‌దులు తొక్క తీసేసి తిన‌డం బెట‌ర్.

నిమ్మ‌జాతి పండ్లు
ఆరెంజ్, నిమ్మ‌కాయ తొక్క‌లు ఎంతో రుచికరంగా ఉంటాయి. చాలా మంది డ్రింక్స్, స‌లాడ్స్‌లో వేసుకుని తింటుంటారు. కానీ ఆ తొక్క‌లు చేదుగా ఉంటాయి. తినాల‌న్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ముఖ్యంగా అవి డైజెస్ట్ అవ్వ‌వు. సో.. ఇలాంటివి తినేట‌ప్పుడు తొక్క తీసే తినండి.