Karnataka CM రేసులో డీకే, సిద్దూ.. ఫైనల్‌గా ఇతనే ఫిక్స్‌?

bengaluru: కర్నాటక ఎన్నికల్లో(karnataka elections) కాంగ్రెస్‌(congress) భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే.. సీఎం అభ్యర్థి ఎంపిక ఇప్పడు ఆ పార్టీకి మరో అగ్ని పరీక్షలా మారింది.. సీఎం రేసులో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(kpcc president dk siva kumar), కర్నాటక మాజీ సీఎం సిద్దారామయ్య(ex cm siddaramaiah) ఉన్నారు. వీరిద్దరిలో సీఎం పదవి(cm race) ఎవరిని వరిస్తుందో.. ఉత్కంఠగా మారింది. అయితే.. గతంలో లాగా సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌ నాన్చుడి దోరణి కనిపించట్లేదు. ఇవాళ సీఎల్పీ మీటింగ్‌లో అభ్యర్థి పేరును ఖరారు చేయనుంది. రేపు సీఎం ప్రమాణ స్వీకారోత్సం జరుగుతుందని ఇప్పటికే చెప్పింది. ఇక కర్నాటకలో డీకే, సిద్దారామయ్య వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కాబోయే సీఎం తమ నాయకుడేనంటూ.. మద్దతు ప్రకటిస్తున్నారు. సోషల్‌మీడియాలో కూడా ఇదే వార్‌ నడుస్తోంది.

సీఎం అభ్యర్తి ఎంపిక విషయంలో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. డీకే, సిద్దూలు చెరో రెండున్నరేళ్లు సీఎంలుగా అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే.. అందుకు ఇద్దరూ ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది. అయితే.. సీఎం రేసు ముందు వరుసలో సిద్దారామయ్య ఉన్నారని టాక్‌ నడుస్తోంది.గతంలో కర్నాటక సీఎంగా కూడా ఆయన పనిచేశారు. ఆ సమయంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా.. సిద్దాకు దాదాపు 75 ఏళ్లు నిండాయి. ఇవే తన చివరి ఎన్నికలని ఇప్పటికే ప్రకటించారు. ఈనేపథ్యంలో అధిష్టానం ఏవిధంగా నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక డీకే శికకుమార్‌ కూడా ప్రజల్లో మంచి పాపులారిటీ ఉంది. అయితే… సిద్దారామయ్యకు ఉన్న పాపులారటీ లేదు. కానీ పార్టీ కోసం డీకే తొలి నుంచి పనిచేశారు. గడ్డుకాలంలో, బీజేపీ ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఆఫర్లు ఇచ్చిన ఆయన పార్టీ వీడలేదు. ఈ అంశం ఆయనకు కలిసొచ్చేలా ఉంది.