Trisha Krishnan బ్యూటీ సీక్రెట్స్​ తెలుసా!

Hyderabad: టాలీవుడ్​లోనూ వరుస సినిమాలతో స్టార్​ హీరోయిన్​గా రాణించిన తమిళ బ్యూటీ త్రిష కృష్ణణ్(Trisha Krishnan)​. నలభై ఏళ్లు దాటినా క్యూట్​ లుక్స్​తో ఈ తరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ వర్షం(Varsham), నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సక్సెస్​ఫుల్​ హీరోయిన్​గా కొనసాగుతున్న త్రిష తొలినాళ్లకంటే ఇప్పుడు మరింత క్యూట్​గా కనిపిస్తూ అభిమానుల మనసు దోచేస్తోంది.

విజయ్​ సేతుపతి, త్రిష జంటగా నటించిన ‘96’ సినిమా త్రిష కెరీర్​కి చాలా ప్లస్​ అయ్యింది. సెకండ్​ ఇన్నింగ్స్​లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. తాజాగా క్లాసిక్​ డైరెక్టర్​ మణిరత్నం(Mani Ratnam) రూపొందించిన పొన్నియన్​ సెల్వన్(PS1), పొన్నియన్​ సెల్వన్​​2(PS2)లో తన అందం, అభినయంతో మరోసారి మెప్పించింది త్రిష. దీంతో త్రిష రోజురోజుకీ అందంగా ఎలా కనిపిస్తోందా అని తన ఫిట్​నెస్​​ సీక్రెట్స్​(Fitness secrets) తెలుసుకునేందుకు తెగ వెతుకుతున్నారు అభిమానులు. త్రిష డైలీ రొటీన్​, తినే ఆహారం గురించి తెలుసుకుంటున్నారు. త్రిష తన శరీరాన్ని ఫిట్​గా ఉంచుకోవడం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందట. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడంతోపాటు ఎక్కడున్నా ఇంటి భోజనమే చేస్తుందట. త్రిషకు బాక్సింగ్​ అంటే చాలా ఇష్టం. తరచూ బాక్సింగ్​ చేయడం వల్ల భుజాలు దృఢంగా మారుతాయి. షూటింగ్స్​తో ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా వర్కౌట్స్​ చేయడంతోపాటు యోగా కూడా చేస్తుందట. అందుకే నాలుగు పదుల వయస్సులోనూ ఈతరం కుర్రకారును కట్టిపడేసే అందంతో మెరిసిపోతుందన్నమాట.