Alcohol: ఇక ఆఫీస్‌లోనూ మందేయొచ్చు..!
Haryana: వీలైతే మద్యాన్ని(alcohol) నిషేధించే దిశగా చర్యలు తీసుకోవాలి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏకంగా ప్రోత్సహిస్తోంది. వర్క్ ప్రదేశాల్లోనూ మద్యం(alcohol) సేవించవచ్చు అనే పాలసీని తీసుకొచ్చింది హర్యానా(haryana) రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ కంపెనీలో కనీసం 5000 మంది ఉద్యోగులు ఉండాలి, లక్ష చదరపు అడుగుల్లో ఆఫీస్ నిర్మాణం ఉండాలి. అలాంటి కంపెనీలకే ఆల్కహాల్ బేవరేజీలను పెట్టుకోవడానికి అనుమతి ఉంటుంది.
L-10F అనే స్పెషల్ లైసెన్స్ పాలసీ ద్వారా కొన్ని కంపెనీలకు ఆఫీస్‌లోనూ ఉద్యోగులు మందు తాగేందుకు హర్యానా ప్రభుత్వం పర్మిషన్ ఇస్తోంది. ఆ కంపెనీ సంవత్సరానికి రూ.10 లక్షలు చెల్లిస్తేనే ఈ పర్మిషన్ లభిస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద మరో రూ.3లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కంపెనీల్లో ఏవైనా ఈవెంట్లు, పార్టీలు ఉంటే స్పెషల్‌గా ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. కాకపోతే.. ఈవెంట్లో పాల్గొనేవారి సంఖ్య 25,000 ఉండాలి. అలా ఉంటే ఒక్కో ఈవెంట్‌కు రూ.10 లక్షలు చెల్లించాలి. అయితే హర్యానా ఫారిన్ లిక్కర్‌కు అనుమతి ఇవ్వదు. ఇండియాలో తయారుచేసే ఫారిన్ లిక్కర్‌కి మాత్రమే పర్మిషన్. అసలు ఇలాంటి పాలసీని తీసుకురావాలని హర్యానా ప్రభుత్వానికి ఎందుకు అనిపించిందో కానీ.. ఇది ఏమాత్రం మంచి నిర్ణయం కాదని పలువురి వాదన.