Chiranjeevi: అయ్యన్ ప్రణతికి మెగాస్టార్ అభినందనలు

Hyderabad: సింగ‌ర్ అయ్య‌న్ ప్ర‌ణ‌తిని(ayyan pranathi) మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) అభినందించారు. వైజాగ్‌కి చెందిన ప్ర‌ణ‌తి.. ఐడల్ సీజన్ 2లో టాప్‌ 6లో కొనసాగుతూ విజయం వైపు దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అయ్యన్ ప్రణతిని స్వయంగా అభినందించారు. అయ్యన్ ప్రణతిని కుటుంబ సమేతంగా చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించారు. ప్రణతి మధురగానాన్ని భార్య సమేతంగా ఆస్వాదించారు. చిరంజీవిలాంటి గొప్ప‌వారు త‌మ‌లాంటి సామాన్యుల ప్ర‌తిభ‌ను గుర్తించి ప్ర‌శంసించినందుకు సంతోషంగా ఉంద‌ని ప్రణతి తల్లిదండ్రులు ఉదయ కుమార్, భారతిదేవిలు పేర్కొన్నారు. చిరంజీవి దంపతులకు తమ కృతజ్ఞతలు వీరు తెలియజేశారు.