DK Shivakumar బ‌ర్త్‌డే రోజున‌..కొత్త‌ సీఎం ప్ర‌మాణ‌స్వీకారం..!

Bengaluru: కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. ఇక కర్ణాటకలో 15న‌ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు(DK Shivakumar). కంఠీరవ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే అదే రోజు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్(DK Shivakumar) పుట్టినరోజు కావడం విశేషం. దీంతో డీకేకు కాంగ్రెస్ హైకమాండ్ ఏం గిఫ్ట్ ఇస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో తన బర్త్ డే రోజు సోనియాకు గిఫ్ట్ ప్రకటిస్తానని డీకే అన్నారు. అయితే శివకుమార్ పుట్టినరోజునే కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరనుండటం విశేషం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్ననున్నారు.

సీఎల్పీ సమావేశం తర్వాతే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం ఎవరనే అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్పందించారు. అధిష్టానం నిర్ణయం ఫైనల్ అని చెప్పారు. గత కొంత కాలంగా మాజీ సీఎం సిద్దా రామయ్య, కేపీసీసీ డీకే శివకుమార్ మధ్య విభేదాలు వున్నాయి. కానీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసే పని చేశారు. ముఖ్యమంత్రి రేసులో ఇద్దరూ వున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి సీఎం పదవి ఇచ్చినా.. మరొకరు అలిగే అవకాశం వుంది. ఇది కాంగ్రెస్‌ అధిష్టానానికి అగ్నిపరీక్షే అని చెప్పవచ్చు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి కానున్నారు. చెరొకరికి రెండున్నర సంవత్సరాలు ఇచ్చే అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పరిశీలించవచ్చు.