Karnataka Elections: BJP 38 ఏళ్ల ట్రెండ్‌ను తిరగరాస్తుందా?
Bengaluru: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(karnataka elections) విజయం కాంగ్రెస్ (congress)వైపే ఉన్నట్లు తెలుస్తోంది. BJP వెనుకంజలో ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్క్‌ను దాటేసింది. కాంగ్రెస్(congress).. తమ ఎమ్మెల్యేలను సేఫ్‌గా ఉంచడానికి తమిళనాడుకు సాగనంపుతోంది. సాయంత్రం తీర్పు వెలువడ్డాక తిరిగి వారిని బెంగళూరుకు రప్పించనుంది. అయితే..ఈసారి BJPకి కర్ణాటక వెన్ను చూపించినట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో BJP మెజార్టీ దక్కించుకుని బసవరాజు బొమ్మైని రాష్ట్ర సీఎంగా నియమించింది. అయితే కర్ణాటకలో గత 38 ఏళ్లలో ఏ పార్టీ అభ్యర్ధి కూడా వరుసగా రెండు సార్లు సీఎం అయినది లేదు. దానిని BJP తన గెలుపుతో ఆ ట్రెండ్‌ను తిరగరాస్తుందా లేదా అనేది మరి కాసేపట్లో తెలిసిపోతుంది.