షారుఖ్‌కు ప్రియాంకా చోప్రా కౌంటర్!
Mumbai: స్టార్ హీరోయిన్గా పలు సినిమాలతో బాలీవుడ్(Bollywood) ప్రేక్షకులను అలరించిన ప్రియాంకా చోప్రా(Priyaka chopra).. ప్రస్తుతం హాలీవుడ్(Hollywood)లో రాణిస్తోంది. క్వాంటికో సిరీస్ సక్సెస్ కావడంతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది ప్రియాంక. హాలీవుడ్‌లోనే వరుస సినిమాలు, సిరీస్లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా సిటాడెల్(Citadel) సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియాంక ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది. కాగా, ఓ ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీపై మాట్లాడుతూ కింగ్ ఖాన్ షారుక్(Shah Rukh Khan) పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను అహంకారిని కాదు. కంఫర్టబుల్ నాకు బోరింగ్’ అంటూ.. షారుక్ ని ఉద్దేశించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
గతంలో ఓ ఇంటర్వ్యూలో ‘మీరెందుకు హాలీవుడ్కు వెళ్లట్లేదు’ అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేనెందుకు హాలీవుడ్ వెళ్లాలి. నాకు అక్కడ కంఫర్టబుల్ ఉండదు. అందుకే అక్కడికి వెళ్లడం నచ్చదు’ అని జవాబిచ్చాడు షారుఖ్. ఆ మాటలకు కౌంటర్‌గా షారుఖ్‌పై కామెంట్స్ చేసింది ప్రియాంక.
‘నేను అహంకారిని కాదు. కంఫర్టబుల్ నాకు బోరింగ్ అనిపిస్తుంది. నాకు టాలెంట్ ఉంది. అందుకే వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలనుకుంటా. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తా. కానీ, కొందరు అలా కాదు. కంఫర్ట్ను కోరుకుంటారు. ఉన్నచోటే ఉండాలని అనుకుంటారు’ అంటూ కామెంట్స్ చేసింది ప్రియాంక. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ ప్రియాంకపై ఫైర్ అవుతున్నారు.