Anni Manchi Sakunamule: ట్రైల‌ర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్

Hyderabad:  టాలీవుడ్​ యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Sobhan), మలయాళీ భామ మాళవిక నాయర్(Malavika Nair) జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’(Anni Manchi Sakunamule).  డైరెక్టర్​ నందిని రెడ్డి(Nandini Reddy) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా మే 18న విడుదల కానుంది. దీంతో ఈ ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

తారక్(Tarak)​ విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. చక్కటి చల్లగాలిలా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. రెండు ఫ్యామిలీల మధ్య జరిగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో పాటు క్యూట్​ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్‌ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను  మెస్మరైజ్ చేయనున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్​ కుమార్తె ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమాను మే 18న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే విడుదలయ్యే వరకు ఆగాల్సిందే!