సమంత పాటపై బేబమ్మ కామెంట్స్​!

Hyderabad: మొదటి సినిమా ఉప్పెన(Uppena)తోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ కృతి శెట్టి(Krithi Shetty). ఈ సినిమా విజయంతో వరుస అవకాశాలు అందుకుంది బేబమ్మ. అయితే వరుస ప్లాపులతో కెరీర్​లో కాస్త వెనకపడిపోయింది. తాజాగా కస్టడీ(Custody) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి. బంగార్రాజు(Bangarraju) తర్వాత నాగచైతన్య(Naga Chaitanya) తో కలిసి మరోసారి కస్టడీలో మెప్పించింది. ఈ సినిమా విజయంతో కృతి, చైతన్య సక్సెస్​ఫుల్​ జంటగా పాపులర్​ అవుతున్నారు.

ఇక కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది చిత్రబృందం. ఓ ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ సమంత చేసిన లాంటి ఐటమ్​ సాంగ్స్​ చేయనని చెప్పింది. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్​గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో యాంకర్​ ‘ఊ ఊ అంటావా..లాంటి పాటలను చేస్తారా’ అని కృతిని అడిగారు. దానికి కృతి సమాధానమిస్తూ.. ‘ప్రస్తుతానికి నేను అలాంటి సాంగ్స్ చేయను. ఇప్పట్లో అయితే అలాంటి పాటలు ఒప్పుకోను. వాటిపై నాకు ఎలాంటి ఐడియా లేదు. నా సినీ ప్రయాణంలో నేను తెలుసుకున్నది ఒకటే. సౌకర్యంగా లేకపోతే చేయకపోవడమే మంచిది. కానీ ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. సాంగ్ లో సమంత మాత్రం చాలా బాగా డ్యాన్స్ చేసింది’ అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం కస్టడీ సక్సెస్​ని ఎంజాయ్​ చేస్తోంది బేబమ్మ.

అల్లు అర్జున్​(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar)​ రూపొందించిన పుష్ప(Pushpa) సినిమాలో సమంత ఐటమ్​ సాంగ్​ చేసిన సంగతి తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad)​ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్​లో సెన్సేషన్​ క్రియేట్​ చేసింది. పుష్ప2(Pushpa2)లోనూ అలాంటి ఐటమ్​ సాంగ్​ ఉండబోతోందని టాక్​.