Samantha: ధోనీ ఇష్టం.. కానీ కోహ్లీ కోసం ఏడ్చేశా!
Hyderabad: టాలీవుడ్ హీరోయిన్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) జంటగా నటిస్తున్న సినిమా ఖుషి(Kushi). శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్నఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇటీవల విజయ్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా సమంత, విజయ్ దేవరకొండ ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. IPL నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ వీరిద్దరినీ ఇంటర్వ్యూ చేసింది.
ఈ ఇంటర్వ్యూలో సమంత, విజయ్ దేవరకొండ సినిమాతో పాటు, క్రికెట్ గురించి పలు ఆసక్తికర అంశాలు మాట్లాడారు. వాళ్ళ లైఫ్ లో క్రికెట్ ఎలా భాగమైందో తెలిపారు. ఈ నేపథ్యంలో సమంత తన ఫేవరేట్ క్రికెటర్స్ గురించి చెప్పుకొచ్చింది. ‘MS ధోని నా ఫేవరేట్ క్రికెటర్. అసలు ధోని అంత కూల్ గా ఎలా ఉంటాడో అర్థంకాదు. ఆ విషయంలో చాలా ఇష్టం. IPL లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే నాకు ఇష్టం. ఆ టీంకు సపోర్ట్ చేస్తాను. ఇక విరాట్ కోహ్లీ అంటే కూడా ఇష్టం. గతేడాది విరాట్ కోహ్లీ ఆసియాకప్ లో కంబ్యాక్ సెంచరీ చేసినప్పుడు నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. అప్పుడు ఏడ్చేశాను కూడా’ అని తెలిపింది సామ్. ధోని(MS Dhoni), కోహ్లీ(Virat Kohli) గురించి సమంత తన ఫేవరెట్ అని చెప్పడంతో క్రికెట్(Cricket) అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.