Poonam Kaur: ప‌వ‌న్ కాళ్ల కింద భ‌గ‌త్ సింగ్ పేరా? త‌ప్పు తప్పు

Hyderabad: ప‌వ‌న్ క‌ళ్యాణ్(pawan kalyan) న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్(ustaad bhagat singh) పోస్ట‌ర్‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు న‌టి పూన‌మ్ కౌర్(poonam kaur). త‌న అభిప్రాయాల‌ను ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డిస్తూ సోష‌ల్ మీడియాలో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు పూన‌మ్. ఇప్పుడు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ పోస్ట‌ర్‌పై ఆమె అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. పోస్ట‌ర్‌లో భ‌గ‌త్ సింగ్ పేరు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాళ్ల కింద రాయ‌డం ఆమెకు న‌చ్చ‌లేద‌ట‌. ఓ గొప్ప స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడి పేరును అలా కాళ్ల కింద రాయ‌డమేంటి అంటూ ట్వీట్ చేసారు. వెంట‌నే ఈ పోస్ట‌ర్‌ను, దీని వెన‌క ఉన్న టీంపై భ‌గ‌త్ సింగ్ అభిమాన సంఘానికి ఫిర్యాదు చేయాల‌ని డిమాండ్ చేసారు. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల‌కు మీరు గౌర‌వం ఇవ్వ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు ఇలా అవ‌మానించకండి. ఇటీవ‌ల ఓ పోస్ట‌ర్‌పై భ‌గ‌త్ సింగ్ పేరు కాళ్ల కింద రాసారు. ఈగోనా? అజ్ఞానమా? అని ట్వీట్ చేసారు.