YS Sharmila: దొరకు దోచిపెట్టేందుకే సలహాదారులను పెట్టుకున్నారు
Hyderabad: దొరకు దోచిపెట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం(telangana government) సలహాదారులను ఎంపికచేసుకుందని ఎద్దేవాచేసారు వైఎస్‌ఆర్ టీ అధ్యక్షురాలు షర్మిల(ys sharmila). సీఎం కేసీఆర్(cm kcr) ఇటీవల మాజీ ఐఏఎస్ సోమేశ్‌కుమార్(cs somesh kumar) ని తన సలహాదారుగా నియమించుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అవినీతి సంపాదనే లక్షంగా సలహాదారును సీఎం కేసీఆర్ పెట్టుకుంటున్నారని.. వివిధ పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్బంగా వైఎస్‌ఆర్ టీ అధ్యక్షురాలు షర్మిల(ys sharmila) ఇదే అంశంపై స్పందించారు. ”చెవిటోని ముందు శంఖం ఊదినట్లు.. సలహాలు తీసుకోనోడికి సలహాదారులు ఎందుకో? నియంత నిర్ణయాలతో తెలంగాణను భ్రష్టు పట్టించాడు కేసీఆర్. ఒంటెద్దు పోకడతో తెలంగాణను సర్వనాశనం చేశాడు కేసీఆర్. ప్రజల గోస వినే కమిషన్లకు ఆఫీసర్లు లేరు కానీ దొరకు దోచిపెట్టే సలహాదారులను పక్కనచేర్చుకున్నాడు.
తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేవు కానీ పక్కరాష్ట్రాల మందికి లక్షలు జీతమిచ్చి మేపుతున్నాడు. తెలంగాణ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి పని చేస్తున్నారు. వీళ్ళు రుణమాఫీ అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? రైతుబీమా అమలు చేయమని సలహా ఇచ్చేవాళ్లా? పోడు పట్టాలు, నిరుద్యోగ భృతి ఇవ్వమని సలహా ఇచ్చేవాళ్లా? ఇచ్చేవాళ్లు అయితే వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు? సమాధానం చెప్పండి కేసీఆర్?” అని షర్మిల ట్విట్టర్ వేదికగా ట్వీట్ పెట్టారు.