Jagan: చంద్రబాబు, పవన్‌, పచ్చమీడియా డ్రామాలు నమ్మకండి

kavali: దశాబ్దాలుగా సమస్యల్లో ఉన్న చుక్కల భూముల(dotted lands)ను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసే కార్యక్రమానికి సీఎం జగన్‌(cm jagan) శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలి(kavali)లో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. ‘ప్రతిపక్ష నేత చంద్రబాబు(ex cm chandra babu naidu) 2014 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో ఓ మ్యానిఫెస్టో విడుదల చేశారని.. అందులో 87వేల 612 కోట్లు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని బాబు చెప్పాడన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలు మాఫీ గురించి బాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా అప్పటి వరకు ఇస్తున్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం చంద్రబాబు రద్దు చేశారు. 87వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు.. కనీసం 15 వేలు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ తెలిసినా.. దత్తపుత్రుడు, పచ్చమీడియా కనీసం ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ఓ పెద్దమనిషి ప్రశ్నిస్తానని వచ్చి.. ఒక్క రోజు కూడా చంద్రబాబుని పల్లెత్తి మాట అనలేదు. వ్యవసాయం దండగ అన్న బాబు ఒకపక్క. ఆయన స్క్రిప్ట్‌ ప్రకారం.. డైలాగులు చెప్పే, ప్యాకేజీ స్టార్‌ మరోవైపు ఉన్నారు. వీరిద్దరి డ్రామాలు రక్తి కట్టించాలని ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. ప్రతి రైతుకు చెబుతున్నా.. వీల్ల డ్రామాలు నమ్మి మోసపోకండి.” అని జగన్‌ ఫైర్‌ అయ్యారు.