‘నయన్​ స్వీట్​ పర్సన్’ అని కితాబిచ్చిన షారుఖ్​​!

Hyderabad: లేడీ సూపర్​స్టార్​ నయనతార(Nayanthara), కింగ్​ ఖాన్​ షారుఖ్​ ఖాన్​ (Shah Rukh Khan) జంటగా నటిస్తున్న చిత్రం ‘జవాన్​’(Jawan). పఠాన్(Pathan)​ సినిమా సక్సెస్​తో ఫుల్​ జోష్​లో ఉన్న షారుఖ్​ ఈ సినిమాని త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇక ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee) రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న జవాన్ సినిమా విడుదల పలు కారణాల వల్ల వాయిదా పడింది. సెప్టెంబర్ 7న ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు మేకర్స్.

జవాన్ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియాలో ప్రకటించిన కింగ్ ఖాన్ ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులతో అందరినీ ఆకట్టుకునే యాక్షన్ మూవీ అని చెప్పుకొచ్చారు. తాజాగా షారుఖ్ నయనతార గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నయన్ అందగత్తే కాదు, చాలా స్వీట్ పర్సన్’ అంటూ ఆమెపై తన అభిమానాన్ని వెల్లడించారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్​గా మారాయి. నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లికి షారుఖ్ హాజరైన సంగతి తెలిసిందే.

జవాన్ సినిమాలో విలన్​గా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటిస్తున్నారు. విజయ్ ప్రతిభావంతుడైన నటుడంటూ, తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానంటూ షారుఖ్ ప్రశంసించారు. అంతేకాదు అనిరుధ్​ రవిచందర్​ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో షారుఖ్ కొన్ని జింగిల్స్​ పాడినట్లు చెప్పుకొచ్చారు.​