Pawan Kalyan: దర్శక నిర్మాతలకు జనసేనాని కండిషన్!
Hyderabad: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఓ వైపు ఏపీ రాజకీయాల్లో(AP Politics) క్రియాశీలంగా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. అంతేకాదు ఇదివరకెప్పుడూ లేనంతగా వరుస సినిమాలను లైన్లో పెట్టి చాలా స్పీడ్‌గా పూర్తి చేస్తున్నారు. అయితే పవన్ తాజాగా తాను చేస్తున్న సినిమాల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ తన సినిమాల దర్శక నిర్మాతలకు కొన్ని కండిషన్స్ పెట్టారట. అవేంటంటే.. ప్రస్తుతం తాను నటిస్తున్న మూడు సినిమాలను పవన్ వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేయాలనీ నిర్ణయించుకున్నారట. అందులో భాగంగా సినిమాలను వరుసగా కంప్లీట్ చేయాలనీ చూస్తున్నారట. ఇప్పటికే ఒక దాని తరువాత మరొక సినిమా షూటింగ్‌లకు హాజరవుతూ శరవేగంగా పూర్తి చేస్తున్న పవన్.. తన సినిమా షూటింగ్‌ల గురించి ఆయా చిత్ర దర్శక నిర్మాతలకు కండీషన్ పెట్టారని సమాచారం. వివిధ దశల్లో ఉన్న తన సినిమా షూటింగ్‌లు అన్నింటినీ అతి త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట
పవన్. అందులో భాగంగానే తన సినిమా షూటింగ్‌లను ఆరు నెలల్లోగా కంప్లీట్ చేయాలని దర్శక నిర్మాతలకు చెప్పారట. దానికి అనుగుణంగా దర్శక నిర్మాతలు షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలని కూడా పేర్కొన్నారట పవన్.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలల్లో హరి హర వీర మల్లు(Hari Hara Veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh), ఓజీ(OG), వినోదయ సీతమ్ రీమేక్ సినిమాలను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నాడట. ఇవి పూర్తైన వెంటనే పవన్ ఏపీకి వెళ్లి అక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.