Deepika Padukone: ఇంట‌ర్వ్యూ ఇస్తుండ‌గా.. భార్య‌కు ముద్దిచ్చిన హీరో

Mumbai: బాలీవుడ్ స్టార్ క‌పుల్ దీపిక ప‌దుకొణె(deepika padukone), ర‌ణ్‌వీర్ సింగ్(ranveer singh) కెమిస్ట్రీ గురించి స్పెష‌ల్‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న‌కు దీపిక అంటే ఎంత ఇష్ట‌మో ప‌బ్లిక్‌గానే త‌న ప్రేమ‌ను ఎన్నోసార్లు వ్య‌క్త‌ప‌రిచాడు ర‌ణ్‌వీర్. అయితే ఇటీవల జ‌రిగిన ఓ ఘ‌ట‌న మాత్రం హైలైట్‌గా మారింది. దీపిక ఇంట‌ర్వ్యూ ఇస్తుండ‌గా.. స్టూడియోలోకి వ‌చ్చి మ‌రీ ర‌ణ్‌వీర్ ఆమెకు లిప్‌కిస్ ఇచ్చాడు. ప్ర‌ముఖ మ్యాగ‌జైన్ టైంకు దీపిక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆ స‌మ‌యంలో ర‌ణ్‌వీర్ స‌డెన్‌గా స్టూడియోలోకి వ‌చ్చేసి దీపికకు ముద్దుపెట్టేసాడు. అదే స‌మ‌యంలో దీపిక త‌న పెళ్లి గురించి డిస్క‌స్ చేస్తున్నారు. నువ్వేంటి ఇలా వ‌చ్చావ్ అని దీపిక అడ‌గ్గా… ప‌క్క ఏరియాలో షూటింగ్ జ‌రుగుతోంద‌ని, ఇంట‌ర్వ్యూ ఇస్తున్నావ‌ని తెలిసి వ‌చ్చేసాన‌ని తెలిపాడు. దాంతో ఈ వీడియో కాస్తా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.