Sudigali Sudheer: ఆ ఛాన్సులు వ‌దులుకుని.. సుధీర్‌కి ఓకే చెప్పింది

Hyderabad: బుల్లితెరపై కమెడియన్​గా, యాంకర్​గా పలు షోలతో అలరించిన సుడిగాలి సుధీర్(Sudigali Sudheer)​ సినిమాల్లోనూ సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన సుధీర్​ ఇప్పటికే మూడు సినిమాలు హీరోగా చేశాడు. తాజాగా సుధీర్​ నాలుగో సినిమా SS4 కూడా ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ మూవీలో తమిళ బ్యూటీ దివ్య భారతి(Divya Bharathi) హీరోయిన్ గా నటిస్తుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం రామానాయుడు స్టూడియోస్(Rama Naidu Studios)​లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి.

హీరోగా సుడిగాలి సుధీర్ నాలుగో సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకుడు. మహాతేజా క్రియేషన్స్, లక్కీ మీడియా సంస్థలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. గతేడాది ‘గాలోడు'(Gaalodu)తో థియేటర్లలో సందడి చేసిన సుధీర్ తన నెక్స్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో హాట్ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్ గా నటించనుంది. తన మొదటి సినిమా అయిన ‘బ్యాచిలర్’ తో యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది దివ్యభారతి. ఆ తర్వాత రెండో చిత్రంగా ‘మధిల్ మెల్ కాదల్’ అనే తమిళ సినిమాలో నటించింది. ఇప్పుడు మూడో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. టాలీవుడ్​లో చాలామంది హీరోల సరసన అవకాశం వచ్చినా ఈ బ్యూటీ మాత్రం సుధీర్​ సినిమాకే ఓకే చెప్పిందట. మరి ఈ జంట తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.