SSMB28: కీలక పాత్రలో బాలీవుడ్​ నటి!

Hyderabad: టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేష్​ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram)​ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ SSMB 28. అతడు(Athadu), ఖలేజా(Khaleja) తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఉగాదికి విడుదల చేసిన ఫస్ట్​ లుక్​ తో ఈ సినిమాలో మహేష్​ మాస్​ లుక్​తో అలరించబోతున్నాడని తెగ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్​. ఈ సినిమాని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. కాగా, తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్​డేట్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్​ సరసన పూజా హెగ్డే(Pooja Hegde), శ్రీ లీల(Sreeleela) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో మహేష్ బాబుకి అక్కగా బాలీవుడ్ ప్రముఖ నటి నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజోల్(Kajol Devagan) ను తీసుకోవాలని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు.. అందులో భాగంగానే ఈ నటితో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాజోల్ ఈ సినిమాలో మహేష్ బాబుకి అక్క పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గనుక ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కోలీవుడ్​ స్టార్​ హీరో ధనుష్​ సినిమా అయిన రఘువరన్​ బీటెక్​ సీక్వెల్​గా వచ్చిన వీఐపీ సినిమాలో కీలకపాత్రలో మెప్పించారు కాజోల్​. మహేష్​ సినిమాలోనూ అలాంటి ఓ పవర్​ఫుల్​ పాత్రలో కాజోల్​ కనిపిస్తే సినిమాకు మరింత ప్లస్​ అవుతుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.