Cyclone Mocha: భారీ తుఫానుగా మోచా.. బెంగాల్ అలెర్ట్

Kolkata: బంగాళాఖాతంలో మోచా తుఫాను(cyclone mocha) మ‌రింత తీవ్రంగా మార‌బోతున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌శ్చిమ బెంగాల్‌(west bengal), పరిస‌ర రాష్ట్రాల్లో ఈదురు గాలుల‌తో కూడుకున్న వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. ఈ మోచా తుఫాను మ‌రింత తీవ్రంగా మార‌బోతున్న నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అలెర్ట్ విధించారు. దిఘా ప్రాంతంలో 200 మంది విప‌త్తు శాఖ సిబ్బంది (NDRF)ని ఏర్పాటుచేసారు. మే 12న బ‌ల‌ప‌డిన మోచా.. 14 వ‌ర‌కు కుండ‌పోత వ‌ర్షంతో ప‌లు ప్రాంతాల‌ను అత‌లాకుత‌లం చేసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. మ‌త్య్స‌కారుల‌ను, ప‌ర్యాట‌కుల‌ను స‌ముద్ర ప‌రిస‌రాల్లో తిర‌గ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసారు. రేప‌టి నుంచి రెండు రోజుల పాటు త్రిపుర‌, మిజోరాం, ద‌క్షిణ అస్సాం, మ‌ణిపూర్‌ల‌లో భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయి.