Pushpa2: ఐటమ్​ సాంగ్​… హీరోయిన్ క్లారిటీ​!

Hyderabad: క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్(Sukumar) సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే మామూలుగా ఉండవు. అందులోనూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఆయన తీసే సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ మరింత స్పెషల్​గా ఉంటాయి. ఆర్య(Arya), ఆర్య 2(Arya2), పుష్ప(Pushpa).. ఇలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలోని ఐటమ్​ సాంగ్స్​​ రికార్డులు క్రియేట్​ చేసినవే. పుష్పలో సమంత(Samantha) చేసిన సాంగ్​ ఎలాంటి సెన్సేషన్​ క్రియేట్​ చేసిందో చెప్పక్కర్లేదు.  ప్రస్తుతం ‘పుష్ప 2′(Pushpa2)లో ఐటమ్ సాంగ్ ప్లానింగ్ ఎలా ఉండబోతోందనే చర్చ సాగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్​ సీరత్​ కపూర్ (Seerat Kapoor) ​ ఐటమ్​ సాంగ్​ చేయబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముంబై బ్యూటీ సీరత్ కపూర్. ‘పుష్ప 2’ సినిమాలో సీరత్​ ఐటమ్ సాంగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ విషయంపై సీరత్​ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఇటీవల సీరత్​ బన్నీతో దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ‘పుష్ప 2’లో ఐటమ్ సాంగ్ చేసే ఆఫర్ ఆమెకు వచ్చిందని, షూటింగ్ ఫినిష్ అయ్యాక సెల్ఫీ తీసుకున్నారని గుసగుసలు వినిపించాయి. వాటిలో నిజం లేదని సీరత్ కపూర్ స్పష్టం చేశారు.
”పుష్ప 2’లో నేను ఉన్నానని వార్తలు వస్తున్నాయి. అవి పూర్తిగా నిరాధారణమైనవి అని క్లారిటీ ఇస్తున్నాను. అల్లు అర్జున్ మంచి ఫ్రెండ్. ఇటీవల ఆయన్ను కలిశా. కాసేపు మాట్లాడాను. ఓ ఫోటో తీసుకున్నాను. అంతే తప్ప… ఆయన సినిమాలో నేను నటించడం లేదు. అలాగే, నేను ఎటువంటి ఐటమ్ సాంగ్ చేయడం లేదు’ అని సీరత్ కపూర్ ఇన్​స్టా స్టోరీ పోస్ట్ చేశారు. మరి పుష్పలో దుమ్ములేపే ఐటమ్​ సాంగ్​ చేయనుంది ఎవరో తెలియాలంటే చిత్రబృందం ప్రకటించేవరకు ఆగాల్సిందే.