Chatrapati Remake: రిలీజ్‌కి ముందే భారీ ఆఫర్లు!

Hyderabad: ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్(VV Vinayak)​ డైరెక్షన్లో వచ్చిన అల్లుడు శీను(Alludu Seenu) సినిమాతో హీరోగా టాలీవుడ్(Tollywood) ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas)​. బాలీవుడ్(Bollywood)​ ఎంట్రీ కూడా ఛత్రపతి రీమేక్(Chatrapati Remake) వినాయక్​తోనే ​ ప్లాన్​ చేశారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh)​ కొడుకుగా తెరంగేట్రం తేలికే అయినా హిట్​ కొట్టడం మాత్రం చాలా కష్టంగా మారింది. మొదటి సినిమా ఫర్వాలేదనిపించినా తర్వాత తీసిన ఏ సినిమా కూడా చెప్పుకోదగ్గ రిజల్ట్ అందుకోలేదు. దాంతో ఛత్రపతి రీమేక్​తో బాలీవుడ్​ లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు శ్రీనివాస్​. ​వినాయక్ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ నిర్మించిన ఈరోజే (మే 12న) విడుదల కానుంది. అయితే ఛత్రపతి రీమేక్​ విడుదల కాకముందే శ్రీనివాస్ మరో రెండు హిందీ సినిమాలు సైన్ చేసినట్లు తెలుస్తోంది.

తెలుగులో ప్రభాస్‌(Prabhas) హీరోగా ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ బ్లాక్ బస్టర్‌ ఛత్రపతి. టాలీవుడ్‌లో ప్రభాస్ ఇమేజ్‌ను, మార్కెట్ రేంజ్‌ను డబుల్ చేసిన సినిమా ఇది. అందుకే తన బాలీవుడ్‌ డెబ్యూకు ఈ భారీ చిత్రాన్ని ఏరి కోరి మరీ సెలెక్ట్ చేసుకున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.

తెలుగు ఛత్రపతిని దాదాపు యధాతథంగా హిందీ ప్రేక్షకుల కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీమేక్‌ చేశారు. ఛత్రపతి తరువాత కూడా నార్త్ ఇండస్ట్రీలోనే జర్నీ కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఛత్రపతి ప్రమోషన్స్​లో చెప్పుకొచ్చారు శ్రీనివాస్​. డబ్బింగ్ సినిమాలతో బెల్లంకొండ నార్త్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ అయ్యి, యూట్యూబ్ లో విడుదల కాగా మిలియన్లలో వ్యూస్ ని సంపాదించాయి. యూట్యూబ్ లో నార్త్ ప్రేక్షకుల నుంచి ఆ స్థాయి ఆదరణ పొందిన అతికొద్ది మంది సౌత్ హీరోలలో శ్రీనివాస్ ఒకరు. దీంతో ఆయన ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు.